ట్విట్టర్లో జాయిన్ అయిన మణిరత్నం, జగపతి బాబు

ట్విట్టర్లో జాయిన్ అయిన మణిరత్నం, జగపతి బాబు

Published on Jun 11, 2014 1:30 PM IST

maniratnam-jagapathi-babu
ప్రస్తుతం సినీ ప్రపంచం మొత్తం తమ అభిమానులతో టచ్ లో ఉండడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో సందడి చేయడం మొదలు పెట్టారు. సూపర్ స్టార్ రజినీ కాంత్, మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోల నుండి అందరు హీరోయిన్స్, చిన్న హీరోలు, డైరెక్టర్స్ ఫేస్ బుక్, ట్విట్టర్ లో సందడి చేస్తూ తన అభిమానులతో రోజూ కాంటాక్ట్ లో ఉంటున్నారు.

వీరి జాబితాలో తాజాగా సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం కూడా చేరారు తాజాగా ఆయన ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. ఈయన తెలిపే విశేషాలు తెలుసుకోవాలంటే @IManiRatnam ట్విట్టర్ ఐడిని ఫాలో అవ్వండి.

ఒకప్పటి టాలీవుడ్ ఫ్యామిలీ హీరో, ప్రస్తుతం టాలీవుడ్ న్యూ ట్రెండీ విలన్ జగపతి బాబు కూడా తాజాగా ట్విట్టర్ లో జాయిన్ అయ్యాడు. ఈ జగ్గూ భాయ్ విశేషాలు తెలుసుకోవాలంటే మీరు @IamJagguBhai ట్విట్టర్ ఐడిని ఫాలో అవ్వండి.

తాజా వార్తలు