మావోయిస్టుగా జగ్గు భాయ్

jagapathi-babu

‘లెజెండ్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ చూపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న జగపతి బాబు అలియాస్ జగ్గు భాయ్. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో జగపతి బాబుకి వరుసగా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ రోల్స్ చేస్తున్నాడు. ఇలా బిజీగా ఉంటూనే తను చేయదలుచుకున్న సినిమాలను కూడా సోలో హీరోగా చేస్తున్నాడు. అలా జగపతి బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘హితుడు’. నిన్ననే ఈ సినిమా మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ ‘హితుడు సినిమాలో నేను చేసిన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఒకవైపు టీచర్ గా కనిపిస్తాను, మరోవైపు మావోయిస్టుగా కనిపిస్తాను. ఇదొక సామాజిక బాధ్యతా ఉన్న సినిమా. తొలి చిత్రమైనా డైరెక్టర్ విప్లవ్ చాలా బాగా తీసాడని’ అన్నారు. మీరా నందన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కెఎస్వీ నిర్మాత. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

Exit mobile version