‘తమిళ స్టార్‌’తో జగపతి బాబు !

jagapathi babu
ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు విలన్‌ గా టర్న్‌ తీసుకుని తీరిక లేనంత బిజీ అయ్యారు. మహిళా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆయన నెగెటివ్‌ రోల్స్ ను కూడా వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు. తెలుగుతో పాటు తమిళం మలయాళం లో కూడా నటిస్తూ సత్తా చాటుతున్నారు.

గతంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ పక్కన ‘లింగ’లో, మోహన్‌ లాల్ ‘పులిమురుగన్‌’ చిత్రాల్లో నటించి మెప్పించిన జగపతి బాబు మరో తమిళ స్టార్ సినిమాలో కూడా నటిస్తున్నారు. దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఎన్జీకే’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం జగపతిబాబు పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రబృందం చిత్రీకరిస్తోందని సమాచారం. ఈ చిత్రంలోనూ జగపతిబాబు నెగెటివ్‌ పాత్రలోనే కనిపించనున్నారు.

Exit mobile version