ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!

Srinivasa-Mangapuram

ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా, రాషా తడాని కథానాయికగా పరిచయమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ లవ్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

ప్రైమ్ వీడియోలో 5 భాషల్లో స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఆగస్టు 20 నుంచి ప్రసారం కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల ఆడియోలతో ఈ మూవీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సమర్పణలో సి.కె. పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు అశ్వినీదత్, జెమిని కిరణ్, గుళ్లపల్లి కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా వీక్షించవచ్చు.

Exit mobile version