మారుతిగా మారిన సంగీత్ శోభన్.. గ్లింప్స్ వచ్చేది ఆరోజే..!

టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ యాక్టర్ సంగీత్ శోభన్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తు దూసుకెళ్తున్నాడు. నేడు(ఆగస్టు 19) ఆయన పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించి పలు అప్డేట్స్ ఇచ్చాడు సంగీత్ శోభన్. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ‘కుమారి 21F’ ఫేమ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో రూపొందించేందుకు రెడీ అయ్యాడు.

ఈ చిత్రంలో సంగీత్ శోభన్ మారుతి అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ‘మా మారుతికి హ్యాపీ బర్త్ డే’ అంటూ మేకర్స్ ఈ చిత్రం నుంచి సంగీత్ శోభన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తో ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా రానుందనే సంకేతం లభిస్తోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 23న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ కొత్త కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, వల్లభనేని గిరిబాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version