పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత కొద్ది రోజులుగా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రమోషనల్ అప్‌డేట్స్ రాకపోవడంతో, సినిమా విడుదల వాయిదా పడనుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.
ఈ ప్రచారానికి చెక్ పెడుతూ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లే అక్టోబర్ 15, 2026న ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని స్పష్టం చేస్తూ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ‘అలా బొలేలో’ సాంగ్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, త్వరలోనే ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్.జె. సూర్య, హృతిక్ రోషన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.


