తెలుగులో ‘జైలర్ 2’ క్రేజ్ ఏమైంది? రజినీ సీక్వెల్‌కు డల్ బుకింగ్స్!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన సీక్వెల్ ‘జైలర్ 2’ ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు తొలుత భావించినప్పటికీ, ప్రస్తుత బుకింగ్స్ ట్రెండ్ అంచనాలకు తగ్గట్టుగా కనిపించడం లేదు.

ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ తీవ్ర నిరాశపరుస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రీ-సేల్స్ ద్వారా కేవలం రూ. 3 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. మొదటి భాగం టాలీవుడ్‌లో సాధించిన ఘన విజయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ మొత్తం చాలా తక్కువనే చెప్పాలి.

దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ తెలుగు వెర్షన్ బుకింగ్స్ మందకొడిగానే సాగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్, మ్యూజిక్ తెలుగు ప్రేక్షకుల్లో ఆశించినంత హైప్ తీసుకురాలేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీంతో విడుదల రోజు వచ్చే పాజిటివ్ టాక్‌పైనే సినిమా కలెక్షన్ల ప్రయాణం ఆధారపడి ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ థియేటర్లలో ఏ స్థాయి కంటెంట్‌ను అందించబోతున్నారనే దానిపైనే బాక్సాఫీస్ ఫలితం మారే అవకాశం ఉంది.

Exit mobile version