ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న చిత్రాల్లో బాలీవుడ్ భారీ సినిమా ‘రామాయణ’ కూడా ఒకటి. భారీ విజువల్ ట్రీట్ గా పూర్తి హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి బిగ్ స్టార్స్ నటించారు.
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ని మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేయడం ఒకింత సర్ప్రైజింగ్ గా మారింది. రామాయణ అంటే ‘జటాయు’ ఎపిసోడ్ కూడా ఎంతో కీలకం. ఆ జటాయు పాత్రలోనే 71 ఏళ్ల అనుపమ్ ఖేర్ నటించినట్టు మేకర్స్ కొత్త పోస్టర్ తో రివీల్ చేశారు.
అయితే తాను కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చారని కూడా కొన్ని వినిపిస్తున్నాయి. మరి సినిమాలో తన ప్రెజెన్స్ కేవలం గరుడ రూపంలోనే ఉంటుందా లేక తనలా కూడా ఉంటుందా అనేది చూడాలి. ఇక ఇదే సీనియర్ నటుడు ప్రభాస్ ‘ఫౌజీ’లో గాంధీ పాత్రని కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
