సూపర్‌స్టార్ రజనీకాంత్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. తమ అభిమాన స్టార్ హీరో పుట్టిన రోజు కావడంతో, తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకమైన రోజుని జరుపుకుంటున్నారు అభిమానులు. స్టార్ హీరో నెక్స్ట్ మూవీ నిర్మాతలు వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఒక అప్డేట్ తో ముందుకు వచ్చారు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న జైలర్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ పవర్ ఫుల్ గా కనిపించనున్నారు.
బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్ రివీల్ అయింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు జైలర్ యొక్క గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రజనీ స్టైలిష్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్, యోగి బాబు మరియు వసంత్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.