‘చిరు 158’ కోసం ‘జైలర్’ టెక్నీషియన్.. ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘చిరు 158’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా, త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సినిమాటోగ్రాఫర్‌గా ‘జైలర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాల ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను ఎంపిక చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా ఈ అప్‌డేట్‌ను ప్రకటించింది. దీంతో ఈ మూవీని ఆయన ఎలా ప్రజెంట్ చేస్తారా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరికొత్త స్టైలిష్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా మే 21న అధికారికంగా ప్రారంభం కానుంది.

Exit mobile version