జనవరి 30న థియేటర్లలోకి ‘జమాన’

Untitled 1

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్, శశికాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరి 30న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో, నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ సినిమాను రూపొందించారు. వినోదంతో పాటు ఊహించని మలుపులతో సాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ చిత్రంలో ఉంటుందని దర్శకుడు భాస్కర్ తెలిపారు. తమ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని, సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని హీరోలు, నిర్మాతలు వ్యక్తం చేశారు. స్వాతి కశ్యప్‌, జారా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కేశవ కిరణ్‌ సంగీతం, జగన్‌ ఏ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version