కేరళలో ‘జన నాయగన్’ ర్యాంపేజ్.. 150 నిమిషాల్లో 1 కోటి గ్రాస్?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన తన లాస్ట్ చిత్రమే ‘జన నాయగన్’. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ సీఎం అయ్యాక థియేటర్స్ లో ఎట్టకేలకి గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. అయితే విజయ్ కి ఒక్క తమిళ్ లోనే కాకుండా కేరళలో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.

మెయిన్ గా తన గత సినిమాలు బుకింగ్స్ ఇలా ఓపెన్ చేయగానే సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే కేరళలో జన నాయగన్ రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయడంతోనే కేవలం నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1 కోటి గ్రాస్ ని క్రాస్ చేసేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కేవలం 150 నిమిషాల్లోనే జన నాయగన్ కోటి గ్రాస్ అందుకోవడం విజయ్ స్టార్ పవర్ చూపిస్తుంది. పైగా ఆల్రెడీ లీక్ అయ్యిన సినిమా కూడా కావడం విశేషం. దీనితో మరో భారీ ఓపెనింగ్ తనకి అక్కడ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version