‘జన నేత’గా ల్యాండ్ అవుతున్న జన నాయగన్.. నార్త్‌లో రిలీజ్ చేసేది ఎవరంటే..?

Jana Nayagan

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పొంగల్ కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఈ సినిమాను ‘జన నాయకుడు’ అనే టైటిల్‌తో తీసుకురానున్నారు. కాగా, నార్త్‌లో ఈ సినిమాను ‘జన నేత’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను నార్త్ ఇండియాలో జీ స్టూడియోస్ సంస్థ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 9న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version