పవన్ సినిమాల్లో నటించట్లేదు.. క్లారిఫికేషన్ ఇదిగో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను ఇకపై పూర్తి సమయం రాజకీయాల్లోనే ఉంటానని, సినిమాలు చేయనని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. అయినా ఆయన రీ ఎంట్రీ పై అనేకమార్లు రూమర్లు వచ్చాయి. తాజాగా కూడా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆ రూమర్లు మరోసారి ఊపండుకున్నాయి. పవన్ సినిమాను డైరెక్ట్ చేయబోయే దర్శకుడంటూ పలువురి పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

దీంతో అభిమానుల్లో మరోసారి జనసేనానిని వెండితెరపై చూడొచ్చనే ఆశలు చిగురించాయి. కానీ అవేవీ నిజం కాదని తేలిపోయింది. నేరుగా జనసేన పార్టీ అధికారిక విభాగం క్లారిటీ ఇచ్చింది. పవన్ పదవిని వదులుకుని సినిమాల్లోకి వస్తారని కొందరు తప్పుడు లేఖను సృష్టించారని, ఈ తప్పుడు వార్తలను సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పార్టీ లీగల్ విభాగం చర్యలు ప్రారంభించిందని ళ్, పవన్ ఎప్పటికీ ప్రజాక్షేత్రంలోనే ఉంటారని వివరణ ఇచ్చింది. దీంతో నిన్నటి నుండి ప్రచారంలో ఉన్న తప్పుడు వార్తలకు చెక్ పడింది.

Exit mobile version