వర్మను చంపేసిన జనసేన యూత్…మరి వర్మ రియాక్షన్ ఏమిటీ?

rgv

పట్టువదలని విక్రమార్కుడిగా వర్మ తన వివాదాస్పద చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు థియేటర్స్ లోకి తీసుకువచ్చారు. ఆమూవీ లోని కొన్ని సన్నివేశాలు టీడీపీ, జనసేన పార్టీల వారిని విపరీతమైన ఆగ్రహానికి గురిచేశాయి. బాబు ని కరుడుగట్టిన విలన్ గా , లోకేష్, పవన్ మరియు పాల్ పాత్రను వ్యగ్యంగా వారిని అభిమానించే వారు జీర్ణించుకోలేనంతగా చూపించారని టాక్. దీనితో ఆంధ్రప్రదేశ్ లో ఓ గ్రామానికి చెందిన యూత్ వినూత్న రీతిలో ఆయనపై నిరసన తెలిపారు.

ఆయన చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు ఒకింత పరుష పదాలతో ఆయను తిట్టడం జరిగింది. ఈ సంఘటనపై వర్మ స్పందించారు. సదరు బ్యానర్ ని పోస్ట్ చేయడంతో పాటు, బాబు, లోకేష్, పవన్ వీరాభిమానులు సినిమా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేయడం ఆపి, ఆ మూవీని అర్థం చేసుకోవాలన్నారు. సదరు అభిమానులపై ప్రమాణం చేస్తూ ఎవరిని కించపరచడానికి నేను ఆ సినిమా చేయలేదని, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీశానని చెప్పుకొచ్చారు.

Exit mobile version