షూటింగ్‌లో వింత అనుభవాలు.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాం – ‘జిన్’ దర్శకుడు చిన్మయ్ రామ్

1 6

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ పతాకాలపై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన విభిన్న కథా చిత్రం ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వంలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిన్మయ్ రామ్ మీడియా సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. కన్నడలో 17 ఏళ్ల అనుభవం ఉన్న తనకు, తెలుగులో ఇదే మొదటి సినిమా అని ఆయన తెలిపారు.

​నటుడు పర్వేజ్ సింబాకు వచ్చిన ఒక కల ఆధారంగా ఈ కథను రూపొందించామని దర్శకుడు వెల్లడించారు. షూటింగ్ సమయంలో సెట్‌లో లైట్లు ఆగిపోవడం, కెమెరాలు పనిచేయకపోవడం వంటి వింత అనుభవాలు ఎదురయ్యాయని, ప్రమోషన్స్ సమయంలో జరిగిన కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటం అదృష్టమని ఆయన గుర్తుచేసుకున్నారు. నిర్మాత నిఖిల్ గారు కథపై నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా సహకరించారని కొనియాడారు.

​ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అలెక్స్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ప్రతి సన్నివేశాన్ని ఆయన తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారని దర్శకుడు పేర్కొన్నారు. ప్రేక్షకులు పెట్టే ప్రతి రూపాయికి సరిపడా వినోదాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ అయితే వెంటనే ‘జిన్ 2’ పనులు ప్రారంభిస్తామని, అందుకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందని చిన్మయ్ రామ్ స్పష్టం చేశారు.

Exit mobile version