అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా చిత్రం మే 8న PVR Inox పిక్చర్స్ ద్వారా ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో జో శర్మ ‘రాధ’ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు.
ఈ చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సీరియల్ కిల్లర్ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో వంటి ప్రఖ్యాత పెయింటర్ల కళాఖండాల్లా అలంకరించడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సినిమా విడుదల రోజున విలన్ ఎవరో కనిపెట్టిన వారికి రూ. లక్ష బహుమతి ఇస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక ‘కేన్స్’ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లోబల్ ప్రీమియర్‌తో పాటు స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. లాస్ ఏంజెల్స్, లండన్, న్యూయార్క్ వంటి ఫెస్టివల్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి సహా మొత్తం 15 అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది.
మోహన్ మీడియా క్రియేషన్స్, అమెరికాకు చెందిన మెక్ క్వీన్ గ్రూప్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వసంత్ ఇసైపట్టాయ్ సంగీతం అందించారు. చిత్రానికి కో-రైటర్‌గా కూడా పనిచేసిన జో శర్మ.. టాలీవుడ్లో మంచి పాత్రలు చేస్తూ ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
