ట్రైలర్: జోడి జీవితాలతో ఆడుకొనే జూదం

jodi1

ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం జోడి. నూతన దర్శకుడు విశ్వనాథ్ అరిగెల రొమాంటిక్ మరియు ఎమోషనల్ ఎటెర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. ఒకటిన్నర నిమిషానికి పైగా సాగిన ట్రైలర్ లవ్ మరియు ఎమోషనల్ అంశాలతో సాగింది.

సున్నితమైన ప్రేమ జంట మధ్య జూదం పెట్టిన మంటలా ఈ చిత్ర ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మంచి ప్రేమకథతో పాటు, క్రికెట్ బెట్టింగ్ వ్యసనం వలన వ్యక్తులు వారి పైన ఆధారపడిన కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయి అనే అంశం ప్రధానంగా జోడి తెరకెక్కినట్లు అనిపిస్తుంది. నరేష్ ఆది తండ్రి పాత్ర చేస్తుండగా, సీనియర్ నటులు గొల్లపూడి కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్ మరియు సత్య ల కామెడీ బాగుంది. ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version