మౌర్య సిద్దవరం హీరోగా ‘జోకర్’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!

మీరా ప్రొడక్షన్స్ పతాకంపై సందీప్ రామినేని నిర్మిస్తున్న తొలి చిత్రం ‘జోకర్’. ‘మెన్ టూ’, ‘రణరంగం’, ‘కిరాక్ పార్టీ’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మౌర్య సిద్దవరం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గీతా సి శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు.. జోకర్ పాత్రకు మౌర్య సిద్దవరం సరిగ్గా సరిపోయాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

​పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ నెలలోనే జరగనున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరపనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు మంచి ఆదరణ ఉండటంతో దర్శకుడు అదే పంథాలో ‘జోకర్’ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పనిచేయబోయే అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version