
మగధీరుడిలా గుర్రం మీద హీరో సందీప్ కిషన్ ఎంట్రీ, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, అప్ కమింగ్ కమెడియన్ సప్తగిరిలు పంచ్ డైలాగులు, ముగ్గురు అందాల భామల సొగసులు, ట్రెండ్ కి తగ్గట్టు యాక్షన్… తాజాగా విడుదలైన ‘జోరు’ ట్రైలర్ ప్రేక్షకులకు పక్కా కమర్షియల్ యాక్షన్ సినిమా ఫీలింగ్ కలిగించింది.
సినిమా ట్రైలర్ లో మాత్రమె యాక్షన్, సినిమా అంతా కామెడీనే. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నమే ‘జోరు’. నేను ఈ సినిమాలో నటించడానికి ముఖ్య కారణం దర్శకుడు కుమార్ నాగేంద్ర. ‘గుండెల్లో గోదారి’తో సందీప్ కిషన్ లో ఒక మంచి నటుడు ఉన్నాడు అని తెలిసేలా చేశారు. తర్వాత నాతో మాస్ కామెడీతో ‘జోరు’ను తీస్తానని చెప్పారు, అన్నట్లుగానే సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. భీమ్స్ మంచి సంగీతం అందించారు. అని అన్నారు యువ హీరో సందీప్ కిషన్.
రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మలతో సందీప్ రొమాన్స్ చేసిన ‘జోరు’ ఆడియో సోమవారం సాయంత్రం విడుదలైంది. అర్జున్ సమర్పణలో శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.