మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డ్రాగన్’ మేనియా ఇపుడు ఓ రేంజ్ లో నడుస్తుంది. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి తన డైనోసర్ హీరో ప్రభాస్ తో ‘సలార్’ తర్వాత వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు సెట్ చేసుకుంది. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు సినిమాలకి లింక్ ఉండొచ్చు అని సలార్ విలన్ వరద రాజమన్నార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఎప్పుడో ఓ లీక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మొదట కేజీయఫ్ కి సలార్ కి లింక్ ఉంటుంది అని ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ పై కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ వాటిని నీల్ కొట్టిపారేశాడు. కానీ దానికి మించి మన టాలీవుడ్ స్టార్స్ తోనే ఊహించని ప్లాన్ లో ఉన్నట్టు పృథ్వీ ఇచ్చిన లీక్ కేజ్రీగా మారింది. ఇక లేటెస్ట్ గా ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ వస్తున్న నేపథ్యంలో మరోసారి పృథ్వీరాజ్ పాత పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనితో సలార్ కి డ్రాగన్ కి లింక్ ఉంటుందా అనే ప్రశ్న మరోసారి మొదలైంది. ఇప్పుడే దీనిపై క్లారిటీ కావాలి అంటే అది కొంచెం ఎక్కువ ఆశించడమే అవుతుంది కానీ ఒకవేళ ఉంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు రావడం గ్యారెంటీ అనే చెప్పొచ్చు.
Of all the stories Prashanth has told me..Shiv Mannar’s is probably the coolest. Has an unbelievable cross over with another universe as well. 😊 https://t.co/edOXTaNsZx
— Prithviraj Sukumaran (@PrithviOfficial) May 7, 2024
