భీం టీజర్ తో ప్రతీ రికార్డు లెక్క తేల్చిన తారక్.!

NTR 7

బాగా ఆకలితో ఉన్న పులికి ఒక సరైన జింక దొరికితే ఎలా ఉంటుందో అలా తారక్ అభిమానులుకు కొమరం భీం టీజర్ “రౌద్రం రణం రుధిరం” టీజర్ దొరికింది. కొన్నాళ్ల నిరీక్షణకు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ చిత్రంలో కొమరం భీం గా నటిస్తున్న తారక్ నుంచి వచ్చిన ఈ టీజర్ తో భారీ రికార్డులను తారక్ అభిమానులు సెట్ చేసి పారేసారు.

మన తెలుగు నుంచి కనీ వినీ ఎరుగని యూనానిమస్ రికార్డులను టీజర్ వచ్చిన ప్రతీ నిమిషం నుంచి స్టార్ట్ చేసారు. అది ఒక వ్యూస్ మరియు లైక్స్ విషయంలోనే కాకుండా కామెంట్స్ విషయంలో కూడా నెవర్ బిఫోర్ రికార్డులను నెలకొల్పి సంచనలనం సృష్టించారు. ఇదంతా మరియు తారక్ మాస్ యుఫోరియా అనే చెప్పాలి.

ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ టీజర్ 5 లక్షల కామెంట్స్ క్రాస్ చేసి ఇండియాలోని మాసివ్ రికార్డును నెలకొల్పగా ఇప్పుడు అదే తరహాలో అతి తక్కువ గ్యాప్ లో తారక్ పేరిట కూడా ఈ సెన్సేషనల్ రికార్డు నమోదు అయ్యింది. మొత్తానికి మాత్రం మన తెలుగులో తన టీజర్ తో ప్రతీ ఒక్క రికార్డు లెక్కను తారక్ తేల్చేశాడని చెప్పాలి.

Exit mobile version