బాలయ్య కోసం జూ.ఎన్టీఆర్ పోస్ట్.. గర్జిస్తూ మళ్ళీ వెనక్కి రావాలి బాబాయ్..

మన టాలీవుడ్ నట సింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 111వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ లో జరుగుతుండగా ఆ షూట్ లో బాలయ్యకి ఊహించని విధంగా చిన్నపాటి గాయం కావడం షాకింగ్ గా మారింది.

దీనితో బాలయ్య అభిమానులు, సినీ వర్గ ప్రముఖులు బాలయ్య త్వరగా కోలుకొని తిరిగి రావాలని సోషల్ మీడియాలో తెలిపారు. అయితే వీరితో పాటుగా బాలయ్య కుటుంబం నుంచే జూనియర్ ఎన్టీఆర్ కూడా పోస్ట్ చేయడం మరింత వైరల్ గా మారింది.

“త్వరగా కోలుకోండి, బాల బాబాయ్. మీరు వేగంగా కోలుకుని మంచి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు మళ్ళీ గర్జిస్తూ ఫుల్ ఫామ్ లో వెనక్కి తిరిగి రావాలి” అంటూ తారక్ చేసిన పోస్ట్ నందమూరి అభిమానుల్లో కేజ్రీగా మారింది. ఇక తారక్ నుంచి ఈ రెస్పాన్స్ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version