
యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు నటించిన ‘టెంపర్’ సినిమా ఆడియో విడుదల వేడుక కొద్దిసేపటి క్రితమే శిల్పకళావేదిక వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో తారక్ స్పీచ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘గత రెండు మూడు సినిమాల నుండి ప్రేక్షకులు ఆశించినది ఇవ్వలేకపోతున్నానెమో అన్న భావన కలిగింది. ప్రతీస్సారి కష్టపడి చేశా, ఈసారి కసితో పనిచేశా.. ఈ సినిమా చూడండి.. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. నచ్చకపోయినా పర్లేదు. మళ్ళి మళ్ళి సినిమా చేస్తా. మిమ్మల్ని ఎప్పటికైనా మెప్పిస్తా. నాదొక్కటే కోరిక. ప్రతీ నందమూరి అభిమాని కాలర్ ఎత్తుకుని గర్వంగా ప్రపంచమంతా తిరగాలి. అది ఈ నందమూరి నామ సంవత్సరంలోనే జరగాలని నేను నమ్మే భగవంతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారిని కోరుకుంటున్నా’ అని టెంపర్ స్పీచ్ అందించాడు.
పూరి జగన్నాద్ తెరకెక్కించిన ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత. కాజల్ అగర్వాల్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న ఉదయం 5: 07 నిముషాలకు విడుదలవుతుందని నిర్మాత ప్రకటించారు.

