
ఛార్మీ తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మి’ సినిమా టైటిల్ సాంగ్ ఆవిష్కరణ నిన్న జరిగింది. ఈ పాటలో పాత్ర చిత్రీకరణ విశేషాలు తెలుపడం విశేషం. సెక్స్ వర్కర్ గా నటిస్తున్న ఛార్మీ ఈ పాటలో రెచ్చిపోయి డ్యాన్స్ చెయ్యడం విశేషం. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు. భాస్కరబట్ల సాహిత్యాన్ని అందించారు.
జ్యోతిలక్ష్మి ఛార్మీ కెరీర్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఛార్మీ ఈ చిత్ర నిర్మాణంలో భాగంపంచుకోనుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 12న విడుదలకానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి