జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ చిత్రం మొదలైంది

jyothika
సూర్యతో వివాహం మునుపు నటి జ్యోతిక తమిళ చిత్రసీమలో టాప్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది. చిరంజీవితో ‘ఠాగూర్’, నాగార్జునతో ‘మాస్’ సినిమాలలో నటించి టాలీవుడ్ లో సైతం జ్యోతిక తన మార్కు నటనను మనకు రుచి చూపించింది. తాజా సమాచారం ప్రకారం జ్యో తన రెండవ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది “హౌ ఓల్డ్ ఆర్ యు?” అనే సినిమా ఈరోజు చెన్నైలో ప్రారంభమయ్యింది. జ్యోతిక ఈ సినిమాతో గతంలో మాదిరి అభిమానులను అలరించాగాలదా లేదా అన్నది ఆసక్తికరమైన అంశం

తమిళ, మలయాళంలలో ఘనవిజాయాలనూ అందించిన దర్శకుడు రోహన్ ఆండ్రూస్ చేతిలో ఈ సినిమా పడడం విశేషం. సూర్య ఈ సినిమాతో మొదటిసారిగా ప్రొడక్షన్ విభాగంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన “హౌ ఓల్డ్ ఆర్ యు?” అనే సినిమాకు రీమేక్

Exit mobile version