“కాగితం పడవలు” గ్లింప్స్‌ రిలీజ్.. హార్ట్ టచింగ్ గా ఆకట్టుకుంటోంది..!

Kaagitam-Padavalu

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెరకెక్కుతోంది. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “కాగితం పడవలు’అనే టైటిల్ పెట్టారు.

మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ”చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్”అనే డైలాగ్స్ ప్రేమకథలోని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. ఇవి సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచాయి.

దర్శకుడు ఎంజీఆర్ తుకారాం లవ్లీ ఎమోషన్స్, హృదయాన్ని తాకే కథ, అందమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని మలిచినట్లు గ్లింప్స్ చూస్తే అర్ధమౌతోంది.

సోషల్ మీడియాలో గ్లింప్స్ వీడియో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

Exit mobile version