రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా భారత దేశం మొత్తం ప్రజలకి తిరుమల సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత పవిత్రంగా భావిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎంతో సేపు నిరీక్షణ తర్వాత చూసే ఆ కొన్ని క్షణాల కోసమే చాలా మంది వెళుతూ ఉంటారు.
అయితే ఈ నేపథ్యంలో ఇటీవల టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోయిన్ శివాని నాగారం తాను స్వామి వారిని ఏకంగా 15 నిమిషాల పాటు దర్శించుకున్నాను అని ఆ వెసులుబాటు తనకి దక్కినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆమెకి ఎలా 15 నిమిషాల పాటు దర్శనం వెసులుబాటు కల్పించారు అని అనేక విమర్శలు కూడా పడ్డాయి.
ఇక వీటిపై ఈ యంగ్ హీరోయిన్ అసలు క్లారిటీ ఇచ్చింది. 2025 అక్టోబర్ లో తాను తన తల్లి కలిసి ఎయిర్పోర్ట్ లో 10,500 రూపాయల దర్శనం టికెట్ తాను తన తల్లి ఇద్దరం లైన్ లో నిలబడి తీసుకున్నామని ఆ దర్శనంలో స్వామి వారిని కొంచెం కొంచెం చూడడం వీలవుతుంది అని అలా మొత్తం జర్నీలో స్వామి వారిని 15 నిమిషాలు పాటు చూశానని, అలాగే అంతకు ముందు 300 రూపాయల సర్వ దర్శనంలో మూడు సెకన్లు, ఐదు సెకన్లు మాత్రమే చూశానని అలాంటి తనకి పదమూడేళ్ల తర్వాత స్వామి వారిని అంతసేపు అందులోని చాలా దగ్గర చూడడంతో ఆ ఎగ్జైట్మెంట్ లో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాను అని కానీ అది మిస్ లీడ్ అయ్యింది అని ఆమె తెలిపింది. అలాగే ఇది కేవలం తనకనే కాదు ఎవరైనా సరే శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకున్నా కూడా వారికీ ఈ విధంగానే జరుగుతుంది అని శివాని నాగారం అందరికీ ఒక తుది క్లారిటీ అందించింది.
