తమిళనాడు ప్రస్తుత సీఎం దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్ దర్శకునిగా టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా చేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చిత్రమే ‘సిగ్మా’. ప్రమోషనల్ కంటెంట్ తో డీసెంట్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రంని మేకర్స్ తెలుగు, తమిళ్ లో విడుదల చేస్తున్నారు. ఒరిజినల్ గా తమిళ్ లోనే తెరకెక్కించిన ఈ సినిమా తాలూకా తమిళ్ ఆడియో లాంచ్ కూడా ఇటీవల గ్రాండ్ గా జరిగింది.
ఇక ఇప్పుడు తెలుగు వంతు వచ్చింది. మరి తెలుగు వెర్షన్ కోసం మెగా అట్రాక్షన్ తోడు కావడం గమనార్హం. ప్రస్తుతం ‘కాకా’తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో రేపు సెప్టెంబర్ 25న జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరు కానున్నట్టు అనౌన్స్ చేశారు. పార్క్ హయాత్ వేదికగా జరగనున్న ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి షురూ కానుంది. జాసన్ కి తెలుగులో మొదటి ప్రమోషనల్ ఈవెంట్ ఇది. సో అతనేం చెప్తాడో చిరు ఏం చెప్తారో చూడాల్సిందే.
The Megastar arrives. 🤩 Thrilled to welcome @KChiruTweets garu as our Chief Guest for the #Sigma Pre-Release event tomorrow at Hyderabad. 🔥#SigmaInCinemasOct2@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @fariaabdullah2… pic.twitter.com/Ys9P9vBLCG
— Lyca Productions (@LycaProductions) September 24, 2026
