మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. డైరెక్టర్ బాబీ మెగాస్టార్‌ను ఒక మధ్యతరగతి వ్యక్తిగా మరియు గ్యాంగ్‌స్టర్‌గా అత్యంత స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాత వెంకట్ నారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక బీటీఎస్ వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోలో చిరంజీవి, బాబీ, నిర్మాత సరదాగా గడుపుతూ కనిపించారు. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా అనుభూతిని అందించడానికి నిర్మాత వెంకట్ నారాయణ బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో అనశ్వర రాజన్, నివేతా పేతురాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
