
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఆ సినిమా ప్రోగ్రెస్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తుంది. ఇక ఆయన తాజాగా నటిస్తోన్న ‘సర్దార్’ సినిమా విషయంలో రోజుకో వార్త హల్చల్ చేస్తూండడంతో సినిమాపై ఉన్న ఆసక్తి డబుల్ అయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘పవర్’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు బాబీతో ‘సర్దార్’ అన్న సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమా కోసం పవన్ మళ్ళీ తన పాత లుక్‌లోకి మారిపోయి కనిపించారు.
గత కొంతకాలంగా గడ్డం లుక్‌తో కనిపించిన పవన్, ఈ సినిమా కోసం మళ్ళీ తన పాత స్టైలిష్ లుక్‌కి మారిపోయారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్తొకటి ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ను సెలెక్ట్ చేసినట్లు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు అనిషా ఆంబ్రోస్‌ను హీరోయిన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరి కాజల్, మరో హీరోయిన్గా నటించనున్నారా? అనిషా ప్లేస్‌లో కాజల్ రానున్నారా? అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత.

