కేవలం రూ.30 లక్షలతో సరిపెట్టుకున్న కాజల్ ?

kajal agarwal

మన తెలుగు హీరోయిన్లను బాలీవుడ్ కలలు ఎప్పుడూ వెంటాడుతునే ఉంటాయి. ఆ కలల్ని నిజం చేసుకోడానికి ఒకటి రెండు సార్లు ట్రై చేసి విఫలమైనా కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు కొందరు. వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఉంది. తెలుగు పరిశ్రమలో దశాబ్దం నుండి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న కాజల్ హిందీలో ‘సింగం, దో లఫ్జొంకి కహాని’ అంటూ రెండు అటెంప్ట్స్ చేసి చేతులు కాల్చుకుని కూడా ఇప్పుడు మరొక రాయి విసరడానికి రెడీ అయింది.

జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కనున్న’ముంబయి సాగ’ సినిమాకు కాజల్ సైన్ చేసింది. ఈ సినిమాకు గాను ఆమె కేవలం రూ.30 లక్షలు మాత్రమే పారితోషకంగా తీసుకుంటోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. తెలుగులో అయితే కనీసం కోటి రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేసే కాజల్ హిందీ పరిశ్రమ మీద మక్కువతో రూ.30 లక్షలకే అడ్జెస్ట్ అవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

Exit mobile version