
‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ‘మగధీర’ సినిమాతో స్టార్డం తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారిన అందాల భామ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ పదేళ్ళ కెరీర్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ స్టార్డం ని తెచ్చుకుంది. కాజల్ తెలుగులో చేసిన చివరి సినిమా టెంపర్ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘దో లఫ్జోన్ కి కహాని’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేషియాలోని కౌలా లాంపూర్ లో జరుగుతోంది.
ఈ సినిమాలో కాజల్ కి జోడీగా రన్దీప్ హుడా నటిస్తున్నాడు. ప్రస్తుతం కౌలా లాంపూర్ లో రన్దీప్ హుడా – కాజల్ అగర్వాల్ పై కొన్ని రొమాంటిక్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో కాజల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. బాలీవుడ్ నటుడైన దీపక్ తిజోరి ఈ సినిమాకి దర్శకుడు. ఇది కాకుండా కాజల్ మరో మూడు తమిళ సినిమాలు చేస్తింది. అందులో ధనుష్ తో చేసిన మారి సినిమా జూలైలో రిలీజ్ కానుంది. టెంపర్ తర్వాత కాజల్ తెలుగులో మరో సినిమాకి సైన్ చేయలేదు.

