తెలుగులో భారీ నష్టాలను మిగిల్చిన కాలా !

Kaala1
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం తమిళనాడు , కర్ణాటకలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది . సినిమా నెగిటివ్ టాక్ ను తట్టుకొని దీటుగా వసూళ్లను సాధిస్తుంది తలైవా కు వున్నా చెరిష్మా దృష్ట్యా ఈ చిత్రం అక్కడ ఇప్పటికి మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.

కానీ తెలుగులో ఈ సినిమా పరిస్థితి అందుకు పూర్తి బిన్నంగా ఉంది . సినిమా నచ్చకుంటే నిర్మొహమాటంగా తిప్పికొట్టే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కు అలాగే చేశారు ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ గా నష్టాలను మిగిల్చింది కేవలం ఈ చిత్రం తెలుగు రాష్టాల్లో 7 కోట్ల షేర్ ను మాత్రమే సాధించింది . ఈ చిత్ర తెలుగు వెర్షన్ ను సుమారు 27 కోట్లు పెట్టు దక్కించుకున్నారు దాంట్లో సగం కూడా వెనక్కి తీసుకరాలేకపోయింది ఈచిత్రం . ఇక తెలుగులో రజినీకి ఇది వరుసగా మూడవ డిజాస్టర్ గతంలో ఆయన నటించిన కబాలి , లింగ చిత్రాలు కూడా ఇక్కడ భారీ నష్టాలనే చవిచూశాయి.

Exit mobile version