కమల్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న కళాభవన్ మణి

Kamal-Haasan-film
విక్టరీ వెంకటేష్ నటించిన ‘జెమిని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు కళాభవన్ మణి. కళాభవన్ మణికి నటుడిగానే కాకుండా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరుంది. గత కొంతకాలంగా కళాభవన్ మణి సినిమాల్లో కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం చాలా రోజుల తర్వాత కళాభవన్ మణి కమల్ హాసన్ సినిమా ద్వారా మళ్ళీ తెరపైకి రానున్నాడు. ఇప్పటికే మళయాళ, తెలుగు కన్నడ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘దృశ్యం’ సినిమాని కమల్ హాసన్ తమిళ్లో రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో లంచగొండి అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కళాభవన్ మణిని ఎంచుకున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకి ‘పాపనాశనం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అలాగే నివేద కమల్ కుమార్తెగా కనిపించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమా అపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. అలాగే విశ్వరూపం 2 కూడా రిలీజ్ కి సిద్దమవుతోంది.

Exit mobile version