ధరమ్ తేజ్ తో సినిమాకి సైన్ చేయలేదన్న కళ్యాణ్ రామ్ !

kalyan-ram-and-sai-dharam-t
కొంత కాలంగా కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ చేస్తాడని, అది కూడా ఎంగా హీరోతో చేస్తాడని వారాలొచ్చాయి. ఇప్పటి వరకూ నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోల్లో ఎవరూ కలిసి నటించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లోనే కాక సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ పై కళ్యాణ్ రామ్ ఓ ఆసక్తికర విషయం తెలిపారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఆయన నటించిన ‘ఇజం’ రేపే విడుదలకానున్న సందర్బంగా మీడియాతో మాట్లాడిన కళ్యాణ్ రామ్ చిత్ర విశేషాలతో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో చేయనున్న మల్టీ స్టారర్ గురించి కూడా చెప్పారు.

సాయి ధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ సినిమా అనుకుంటున్నామని, ఆ ప్రాజెక్ట్ ఉంటుందని అన్నారు. అలాగే దీనికి సంబందించిన స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయని, ఇంకా ఫైనల్ కాలేదని, తాను కూడా ఇంకా సైన్ చెయ్యలేదని, ఒకవేళ ఓకే అయితే చెబుతానని అన్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు ఏఎస్ రవి కుమార్ చౌదరి డైరెక్టరని, కెఎస్ రామారావ్ నిర్మాతనే సంగతి తెలిసిందే.

Exit mobile version