‘పటాస్’ విషయంలో హ్యాపీగా ఉన్న కళ్యాణ్ రామ్

kalyan-ram
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. అవే ‘పటాస్’ మరియు ‘షేర్’. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న పటాస్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్లో జరుగుతోంది. కళ్యాణ్ రామ్ పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

‘పటాస్ షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఈ సినిమాలోని నా పాత్ర విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నానని’ కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి ఫాదర్ గా సాయి కుమార్ కనిపించనున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.

Exit mobile version