బాలయ్య పాటను రీ మిక్స్ చేయనున్న కళ్యాణ్ రామ్

kalyan-ram
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఎన్.టి.ఆర్ ఆర్ట్స్’ బేనర్ లో ముస్తాబవుతున్న కొత్త చిత్రం ‘పటాస్’. ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పొలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులకి కనిపించనున్నాడు. దర్శకుడు అనిల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ ఒక రీమిక్స్ సాంగ్ ను చేయనున్నాడని సమాచారం.

తన బాబాయ్ బాలకృష్ణ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమాలో అప్పటితరాన్ని అలరించిన ‘అరె ఓ సాంబ’ పాటను ఇప్పుడు కళ్యాణ్ తన పటాస్ సినిమాలో రీమిక్స్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా శృతి సోది నటిస్తూ ఈ సినిమాతో టాలీవుడ్ కి అరంగేట్రం చేస్తుంది. విలక్షణ నటుడు సాయి కుమార్ ఈ సినిమాలో ప్రతి నాయక పాత్ర పోషిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతదర్శకుడు.

Exit mobile version