‘ఎంత మంచివాడవురా’.. కథ ఇదేనా ?

Kalyana Ram

నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తోన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఎంత మంచివాడవురా”. కాగా తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. గుజ‌రాతీ సినిమా ‘ఆక్సిజ‌న్’ మూవీ ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకున్నారట. కథ విషయానికి వస్తే.. నాట‌కం స్టేజ్‌ పైనే పుట్టిన హీరో.. ఆ తరువాత అతని లైఫ్ లో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా ఒక నాటకం లాగే.. ఈ జీవితం కూడా ఓ నాట‌క రంగమే అని నమ్ముతాడట. ఆ తరువాత అంద‌రికీ సాయం చేస్తూ.. మంచితనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడని.. ఈ సినిమా కథాంశం ఇదేనని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.

కాగా శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సారి సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, అలాగే బన్నీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకి పోటీగా “ఎంత మంచివాడవురా” సినిమా కూడా రాబోతుంది. మరి ఈ పోటీలో ఎవ్వరు నెగ్గుతారో చూడాలి.

Exit mobile version