నడిగర్ సంఘం ట్రస్టీగా ఉలగనాయగన్

kamal-haasan
గత కొద్ది రోజులుగా తమిళ చిత్ర సీమలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హాట్ టాపిక్ నడిఘర్ సంఘం(సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) ఎలక్షన్స్. శరత్ కుమార్ గ్రూప్ మరియు విశాల్ పండవర్ అని గ్రోపు కి మధ్య పోటా పోటీగా జరిగిన పోటీలో విశాల్ పండవర్ అని టీం అన్ని పోస్ట్ లని క్లీన్ స్వీప్ చేసింది. పండవర్ అని టీంలోని విశాల్, కార్తీ, నాజర్ లు మెయిన్ పోస్ట్ లలో ఎన్నిక అయ్యారు. విశాల్ నడిగర్ సంఘం జెనరల్ సెక్రెటరీగా, సీనియర్ యాక్టర్ నాజర్ ప్రెసిడెంట్ పోస్ట్ కి ఎన్నికైతే, కార్తీ ఏమో ట్రెజరర్ పోస్ట్ కి ఎన్నికయ్యాడు.

నిన్న చెన్నైలో విశాల్ నిర్వహించిన థాంక్స్ గివింగ్ మీట్ లో విశాల్ ఉలగనాయగన్ కమల్ హాసన్ ని నడిగర్ సంఘం అసోషియేషన్ ట్రస్టీగా ఎంపిక చేసారు. ఈ ట్రస్ట్ బోర్డ్ లో కమల్ తో కలిపి మొత్తం 9 మంది ట్రస్టీలు ఉంటారు. ఈ ట్రస్టీలో కమల్ తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉండాలని ఆయనని కోరారు. కానీ రజినీ ఇంకా తన అభిప్రాయాన్ని తెలియజేయలేదు. కమల్ హాసన్ మాత్రం పండవర్ అని గ్రూప్ ని సపోర్ట్ చేయడంలో చాలా ఆనందంగా ఉందని విశాల్ తెలియజేశాడు.

Exit mobile version