హాస్పిటల్ లో కమల్ హాసన్

KAMAL_HAASAN
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కు ఫుడ్ పాయిజన్ కావడంతో చెన్నైలో గల అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం కమల్ ఆరోగ్యం కుదుటపడిందని, అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. మంగళవారం సాయంత్రం లేదా భుదవారం ఉదయం కమల్ ను డిశ్చార్జి చేసే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం కమల్ హాసన్ ‘పాపనాశనం’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మలయాళ, తెలుగు భాషలలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ రీమేక్ ఇది. హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ లో తిరిగి జాయిన్ అవుతారు. మరోవైపు కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో నటించిన ‘ఉత్తమ విలన్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి.

Exit mobile version