ప్రాజెక్ట్-కె ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుంది – కమల్ హాసన్

kamal 1

నేషనల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘ప్రాజెక్ట్‌ కె’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పై తాజాగా కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “50 ఏళ్ల కిందట నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా నా ప్రస్థానం ప్రారంభించాను. ఆ రోజుల్లో నిర్మాతగా అశ్వినీదత్ పేరు బలంగా వినిపించేది. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత ఇద్దరం కలిశాం. నాగ్ అశ్విన్ ఓ మేధావి.

ప్రాజెక్ట్-కె చిత్రం కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు తమ హృదయాల్లో నాకు ఎలాంటి స్థానం ఇచ్చినప్పటికీ, నాణ్యమైన నటన కనబర్చడమే నా తొలి ప్రాధాన్యత. చెప్పాలంటే నేను సినిమా పిచ్చోడ్ని. అందుకే సినిమా రంగంలో ఏ కొత్త ప్రయత్నం నా దృష్టికి వచ్చినా అభినందిస్తుంటాను. ఇప్పుడు ప్రాజెక్ట్-కె చిత్రాన్ని కూడా మొదటగా నేనే అభినందించాలనుకుంటున్నా. ప్రాజెక్ట్-కె చిత్రంలో నా సహనటులు ప్రభాస్, దీపికా పదుకొనే మరియు అమితాబ్ తో కలిసి పని చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. ప్రాజెక్ట్-కె ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుంది’ అంటూ కమల్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version