‘ఉత్తమ విలన్’ కోసం డైలాగులు రాసిన కమల్.

KAMAL_HAASAN

‘ఉత్తమ విలన్’ కథ, స్క్రీన్ -ప్లే అందించిన కమల్ హాసన్ మరో భాద్యతను కూడా తన భుజాలపై వేసుకున్నారు. ఈ సినిమా కోసం కమల్ హసన్ డైలాగులను కూడా రాశారు. గతంలో ఈ సినిమా డైలాగులను క్రేజీ మోహన్ రాస్తున్నారని చెప్పారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రమేష్ అరవింద్ కథ, స్క్రీన్ ప్లేతో పాటు డైలాగులను కూడా కమల్ రాశారని వెల్లడించారు.

‘స్క్రిప్ట్ రాసే సమయంలోనే కమల్ డైలాగులను రాశారు. భారి కథతో పాటు సినిమాలో సున్నితమైన హాస్యానికి ఇంపార్టెన్స్ ఉంది. వాటిని కమల్ అద్బుతంగా రాశారు. క్రేజీ మోహన్ విలువైన సలహాలు, సూచలను అందించారు’ అని దర్శకుడు రమేష్ అరవింద్ అన్నారు.

కమల్ ‘ఉత్తమ విలన్’లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పూజా కుమార్, ఆండ్రియా హీరోయిన్లు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా నిర్మించారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు.

Exit mobile version