‘టిప్పు సుల్తాన్’గా కమల్ హాసన్

1416015667-1041

లెజెండరీ నటుడు కమల్ హసన్ ఎల్లప్పుడూ తన భారి బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకులలో ఆసక్తి క్రియేట్ చేస్తుంటారు. ప్రస్తుతం కమల్ నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వాటి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ తో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, మైసూరు మహారాజు ‘టిప్పు సుల్తాన్’ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ‘టిప్పు సుల్తాన్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. భారి తారాగణంతో వెండితెరపై కన్నుల పండుగగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ చేయడానికి రెండు సంవత్సరాల టైం పడుతుందని ఒక అంచనా. ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశనం’ సినిమాల విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.

Exit mobile version