చివరి చూపుకు దూరమైన కమల్ హాసన్

kamal-hasan
లెజెండరీ దర్శకుడు కె.బాలచందర్ మంగళవారం రాత్రి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. నేడు, బుధవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. కె.బాలచందర్ చివరి చూపుకు కమల్ హాసన్ దూరమయ్యారు. ఎందరో మహా మహా నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్ సొంతం. అందులో ఒకరు కమల్ హాసన్.

ప్రస్తుతం ‘ఉత్తమ విలన్’ నిర్మాణంతర కార్యక్రమాలతో బిజీగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. గురువు గారి మరణ వార్త విన్న వెంటనే చెన్నైకి పయనమయ్యారు. ఈ రోజు రాత్రికి చెన్నై చేరుకోనున్నారు.

రజినీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ కూడా బాలచందర్ శిష్యులే. ఎన్నో గొప్ప సినిమాలను భారతీయ సినిమా ప్రేక్షకులకు అందించిన ఈ దర్శకుడి మరణ వార్త భారతీయ సినిమా పరిశ్రమను శోక సంద్రంలో ముంచేసింది.

Exit mobile version