లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం’ విశ్వరూపం 2 ‘చిత్రాన్ని విడుదల చేసే పనిలో ఉన్నారు. దాంతో పాటు తమిళ బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీటి తరువాత ఆయన ‘శభాష్ నాయుడు ‘ చిత్ర షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. ఆల్రెడీ 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈచిత్ర మిగితా షూటింగ్ వచ్చే నెల నుండి జరుగనుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ వివాదం అవుతుంది. టైటిల్ లో కమల్ క్యాస్ట్ ను ప్రస్తావిస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ఈ చిత్ర టైటిల్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు కమల్ సిద్ధంగా లేడని సమాచారం. ఈ టైటిల్ లో తప్పు ఏం లేదని దాన్ని మార్చే ప్రసక్తే లేదని అంటున్నాడట.
నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ చిత్ర షూటింగ్ బడ్జెట్ సమస్యలవల్ల ఆగిపోయింది. ఈ చిత్రంలో శృతి హాసన్ ,రమ్యకృష్ణ, ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
