నవంబర్‌కు షిఫ్ట్ అయిన ‘కంచె’..!

kanche-movie-news
‘కంచె’.. గత కొద్దిరోజులుగా తెలుగులో అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా. మెగా ఫ్యామిలీ నుంచి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండో సినిమాగా రూపొందిన కంచెపై ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి, ఒక ప్రేమకథకు ముడిపెట్టి విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులు ఒక సరికొత్త అనుభూతికి లోనవుతారని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

ఇక ఈ సినిమాను అక్టోబర్ 2న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సినిమాను నవంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్‌ను అక్టోబర్ 2నుండి నవంబర్ 6కు వాయిదా వేసినట్లు కంచె యూనిట్ తెలిపింది. సినిమాను ఎందుకు వాయిదా వేశారనే విషయమై కంచె టీమ్‌ నుంచి ఈ సాయంత్రం కల్లా ఓ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. పోస్టర్స్, ట్రైలర్‌తో కట్టిపడేసిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల చివరిదశలో ఉంది. వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు.

Exit mobile version