వెనక్కి వెళ్ళిన వరుణ్ తేజ్ ‘కంచె’ ఆడియో

Kancahe
వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ కి ఓ అందమైన ప్రేమకథని జోడించి చెప్పాలనే ఆలోచన ఎవ్వరూ ఆలోచించరు. ఒకవేళ చేసినా సినిమా చేయడానికి ధైర్యం చేయరు.. ఎందుకంటే అది పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. కానీ డైరెక్టర్ క్రిష్ మాత్రం ఆ రిస్క్ ని కూడా ఈజీగా మార్చుకొని చేసిన ప్రతిష్టాత్మక సినిమా ‘కంచె’. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ రెండవ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ కానుంది. అందులో భాగంగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండడంతతో కంచె సినిమా ఆడియోని కూడా రిలీజ్ చెయ్యాలనుకున్నారు.

అందుకోసం సెప్టెంబర్ 12వ తేదీని కూడా సెలెక్ట్ చేసారు. కానీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కంచె ఆడియోని సెప్టెంబర్ 12 నుంచి వాయిదా వేసారు. త్వరలోనే కొత్త ఆడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. ఎక్కువ భాగం సెప్టెంబర్ 3వ వారంలో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలై కల్లా పూర్తైపోయినా ఎక్కువ భాగం గ్రాఫిక్స్ కి స్కోప్ ఉండడంతో రెండు నెలల సమయం తీసుకున్నారు. కంచె సినిమాలోని విజువల్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయని ఈ చిత్ర టీం అంటోంది. 1947 బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ప్రేమకథ ద్వారా చిరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

Exit mobile version