
ముకుందతో మేపించిన మెగా హీరో వరుణ్ తేజ్ వెనువెంటనే జాగర్లమూడి రాధాకృష్ణతో మరో సినిమా మొదలుపెట్టేశాడు. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో సాగే సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘కంచె’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్ర మొదటి లుక్ పోస్టర్ ని ఆగుష్టులో విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాక ఈ పోస్టర్ చూసి అందరూ స్టన్ అయిపోతారని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తుంది.
అక్టోబర్ లో ఈ సినిమా విడుదలకానుంది. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్. ఈ చిత్రం చివరి దశలో వుండగానే వరుణ్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ‘లోఫర్’ అనే చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసినదే.

