‘తలైవి’ కోసం తమిళంలో కూడా డబ్బింగ్ చెబుతుందట !

Thalaivi

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా డబ్బింగ్ మొదలైందని.. కంగనా స్వయంగా తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతుందని తెలుస్తోంది.

మొత్తానికి కంగనా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతుంది. పైగా సినిమాలో మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుందట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పైగా అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.

Exit mobile version